డియర్ కామ్రేడ్స్,
నిన్న జరిగిన మన L. T S. సమావేశంలో మన యూనియన్ పాల్గొని M.
O. S. పై సంతకం చేసిన సంగతి మీకందరికీ తెలిసిందే. ముంబాయి
రిఫైనరీ కి మనకూ M. O. U. లలో వున్న విభేదాలను తొలగిస్తామని యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు,
రెండు చోట్లా జరిగిన M. O. U. లలో వున్న తేడాలను కూలంకషంగా
చర్చించి, ఈ తేడాలను సవరించి సమానం చెయ్యాలని మన యూనియన్
యాజమాన్యాన్ని కోరింది. మొదట్లో దీనికంగీకరించిన యాజమాన్యం, మనం సూచించిన
సవరణలన్నింటినీ నోట్ చేసుకుని, పై
అధికారుల ఆమోదానికి పంపిస్తామని తెలిపింది. అయితే సాయంత్రం జరిగిన మలి విడత
సమావేశంలో ఈ సవరణలు వేటినీ ఉన్నతాధికారులు ఆమోదించలేదనీ, కనుక ఈ సవరణలేవీ M.
O. S. లో పొందుపర్చలేమనీ యాజమాన్యం తిరస్కరించింది.
జనవరి లో జరిగిన M.
O. U. లో ఒక్క సవరణ కూడా చేయడానికి వీలు పడదనీ దానిపైనే యథాతథంగా
సంతకాలు చెయ్యాలనీ యాజమాన్యం యూనియన్లను కోరింది. Financil Implications వున్న ఏ మార్పులనూ ఇప్పుడు చేయలేమనీ, అన్ని చోట్లా M. O. S. లు ముగిసిన
తర్వాత ఏదైనా తేడాలుంటే పరిశీలిస్తామని జి.ఎం. (ఐ.ఆర్) తెలిపారు. మనం సూచించిన అనేక
మార్పులలో కేవలం రిటైర్డ్ మరియు చనిపోయిన ఎంప్లాయీస్ కు ముంబాయిలో
చెల్లించిన విధంగా ఓ.టి. ఎరియర్స్ చెల్లించడానికి మాత్రమే యాజమాన్యం
అంగీకరించింది.
సుదీర్ఘ చర్చల అనంతరం, ఏ Financial మార్పులు చేయలేని పక్షంలో కనీసం ఆపరేషన్ కండిషన్లనైనా తొలగించాలని మన యూనియన్
పట్టుబట్టింది. ముంబాయిలో కేవలం 5 కండిషన్లతో
సరిపెట్టిన యాజమాన్యం మనకు మాత్రం 12 కండిషన్లు విధించడం సరికాదనీ, ఈ అదనపు
కండిషన్లు తొలగించని పక్షంలో ఈ M. O. S. పై మనం సంతకాలు చెయ్యబోమని
నిర్దంద్వంగా తేల్చిచెప్పింది. దీంతో G. M. (I. R.) గారు
ఈ కండిషన్లపై E. D. (V. R.) తో చర్చించి, ముంబాయి M.
O. U. లో లేని అదనపు కండిషన్లను తొలగించడానికి
అంగీకరించారు. దీంతో మన యూనియన్ కూడా ఈ M.
O. S. పై సంతకం చెయ్యడానికి ముందుకొచ్చింది.
మిత్రులారా, యూనియన్లు
ఐక్యతతో కార్మికుల పక్షాన పనిచేసినచోట మాత్రమే మెరుగైన
ఒప్పందాలు జరుగుతాయని మనకు తెలుసు. రిఫైనరీలో వున్న ఈ పరిస్థితుల్లో మనం ఒంటరి
పోరాటం సాగించక తప్పడంలేదు. కాబట్టే మనకు
పూర్తి సమ్మతం కానప్పటికీ ఈ ఒప్పందానికి అంగీకరించాల్సివచ్చింది. ఇప్పటికైనా మన
కార్మికులంతా చైతన్యం
తో ఐక్యమై పోరాడితే కనీసం రాబోయే C. D. P. వంటి
ఒప్పందాలనైనా మెరుగ్గా సాధించుకోగల్గుతాం.
No comments:
Post a Comment