C/o Q. No.B-12-West, Yarada Park,Sriharipuram,Visakhapatnam-530011, A.P. Phone 0891-2894505

VR CDP-MOS signed by Both unions on 14.05.2018

29 December, 2009

ప్రియమైన మిత్రులారా,

మన యూనియన్ బ్లాగ్ కి సుస్వాగతం. మన యూనియన్ కి సంబంధించిన విషయాలను, విశేషాలను మీ అందరితో ఎప్పటికప్పుడు పంచుకోడానికి సరికొత్త వేదిక ను ప్రారంభించాము.
సైట్ లో మన యూనియన్ రోజువారీ విషయాల తో పాటుగా కార్మికులు తెలుసుకోవలసిన మరెన్నో విషయాలను, దేశవ్యాప్తంగా జరిగే మార్పులను ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకువస్తాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎల్ . టి. ఎస్. వంటి కీలక అంశాలను సత్వరమే పంచుకొనేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుంది. మన ఎల్. టి. ఎస్. తో పాటు దేశం లో జరుగుతున్న ఇతర సంస్థల ఎగ్రిమెంట్ల ముఖ్య అంశాలను కూడా ఇక్కడ పొందుపరుస్తాము. విశాఖ రిఫైనరీ కార్మికులంతా సదావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము.
దేశం లోనే మొట్టమొదటిగా మన యూనియన్ చేస్తున్న వినూత్న ప్రయత్నాన్ని కార్మికులంతా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మన యూనియన్ నమ్ముతోంది. కార్మికుల ఆదరాభిమానాలే అండదండలుగా నిలిచి మన వినూత్న ప్రయత్నం దిగ్విజయం అవుతుందని మన యూనియన్ విశ్వసిస్తోంది.


హెచ్ పి సి ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్.